విజయ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు
సాక్షి మీడియాకు రూ. 371 కోట్లు చెల్లింపు
అమరావతి – అధికారం మనోడిదైతే ఎంతైనా వెనకేసు కోవచ్చు. ఏమైనా చేయొచ్చు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏపీ ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. మనోడు జగన్ రెడ్డి అండ చూసుకుని అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చాడు. ఆపై వైఎస్ మీడియా సంస్థకు ఏకంగా రూ. 371 కోట్లు బిల్లులు చెల్లించాడు. ఇవన్నీ ప్రచారం, యాడ్స్ రూపేణా.
దీంతో రంగంలోకి దిగింది ఏసీబీ. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరింది. జగన్ రెడ్డి హయాంలో చక్రం తిప్పిన వారందరిపై ఫోకస్ పెట్టింది. విచారణకు ఆదేశించింది. దీంతో మాజీ ఐఅండ్ పీఆర్ కమిషనర్ విజయ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించింది. ఐపీసీ 120బీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7,13(2), రెడ్ విత్ 13(1a) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. జగన్ రెడ్డి సర్కార్ కు అనుకూలంగా ఉండేలా అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని, ఇష్టానుసారంగా నియమించారని పేర్కొంది. ఏకంగా సాక్షి మీడియాకు భారీ ఎత్తున లబ్ది చేకూర్చినట్లు విమర్శలు ఉన్నాయి.