ఫార్ములా ఈ రేసు కేసుపై ఏసీబీ విచారణ
దాన కిషోర్ నుంచి స్టేట్ మెంట్ రికార్డ్
హైదరాబాద్ – ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు అందుకున్న ఏసీబీ దూకుడు పెంచింది. విచారణకు సంబంధించి రంగంలోకి దిగింది. ఫిర్యాదుదారుడు దాన కిషోర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ ప్రారంభించింది.
ఆయన నుంచి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన తనను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈనెల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది. దీంతో తనను అరెస్ట్ చేయాలని భావించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరికకు అడ్డు పడినట్లయింది. ఇది ఇలా ఉండగానే సంధ్య థియేటర్ ఘటన ను ముందుకు తీసుకు వచ్చారు.
ఇష్యూను మొత్తం డైవర్ట్ చేశాడు సీఎం. అంతా నటుడు అల్లు అర్జున్ వైపు దృష్టి సారించేలా చేశాడు. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయాలు వ్యక్తిగత కక్షలకు దారితీసేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఎ. రేవంత్ రెడ్డి.