అప్పుల కుప్ప తప్ప చేసింది ఏముంది..?
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్
సంపద సృష్టిస్తామని ఉన్నదంతా దోచుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. కూటమి సర్కార్ బక్వాస్ అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, అప్పులు చేయడం తప్ప చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. ఇప్పటికే రూ. 15,485 కోట్ల భారం ప్రజలపై మోపారని ఆరోపించారు. ఎక్కడ సంపదను సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఎందుకు ఊసెత్తడం లేదంటూ ప్రశ్నించారు. ఉబుసు పోక కబుర్లు తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదంటూ మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారని, ఎక్కడ ఉందో చెప్పాలన్నారు.
సంపూర్ణ మద్యపానం, పెన్షన్ హామీలు అమలు చేయలేక పోయారని ఊరూరా, వాడ వాడలా బెల్టు షాపులకు తెర తీశారని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రచారం చేసి..
ఇప్పుడు రూ.15,485 కోట్ల భారం ప్రజలపై మోపారని ఆరోపించారు. దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు.
అమరావతి కోసం రూ.30 వేల కోట్లు అప్పు చేశారని , దాని వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో చంద్రబాబు నాయుడు చెప్పాలన్నారు.