నిజమైన భారత రత్నం వాజ్ పేయి
సీఎం నారా చంద్రబాబు నాయుడు
ఢిల్లీ – భారత దేశం గర్వించ దగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బుధవారం ఢిల్లీలో సదైవ్ అటల్ దగ్గర నివాళులర్పించారు. ఏది ఏమైనా ముందు తనతో ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్ అని ఎప్పుడూ భావించే వారని అన్నారు.
దేశ గతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని అన్నారు. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నదని పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండి పోతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనదని ప్రశంసించారు. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచి పోలేనంటూ గుర్తు చేసుకున్నారు. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నానని అన్నారు.
కవి, రచయిత, అరుదైన నాయకుడు వాజపేయి అని అన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.