ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దు
చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
అమరావతి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. రాష్ట్రంలో పెద్ద హీరోలు నటించిన సినిమాలకు బెనిఫిట్ షోలు , టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వ వద్దని కోరారు. ఇకపై సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. దీని వల్ల ఎవరికి లాభం కలుగుతుందో చెప్పాలన్నారు.
ఎవరి ప్రయోజనాల కోసం వీరు సినిమాలు తీస్తున్నారోనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చూపించే దిశగా సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు మేలు చేకూరుతుందన్నారు.
సినీ ఇండస్ట్రీ ఏపికి రావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుందన్నారు సీపీఐ రామకృష్ణ. ఇప్పటికే సినిమాలు తీసేందుకు అనువైన స్థలాలు, ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. కానీ వీరంతా హైదరాబాద్ కు వెళ్లడం వల్ల ఇక్కడ ఏం లాభం అని ప్రశ్నించారు .