ENTERTAINMENT

రేపే ముహూర్తం సీఎంతో స‌మావేశం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన టీఎస్ఎఫ్‌డీసీ చైర్మ‌న్

హైద‌రాబాద్ – టీఎస్ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజుతో పాటు నిర్మాత అల్లు అర‌వింద్ కిమ్స్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా న‌టుడు అల్లు అర్జున్ , ద‌ర్శ‌కుడు సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల త‌ర‌పు నుంచి మొత్తం రూ. 2 కోట్లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సాయానికి సంబంధించిన చెక్కుల‌ను త‌న‌కు ఇచ్చార‌ని , ఈ కుటుంబం మొత్తం బాధ్య‌త‌ను తాను తీసుకుంటున్నాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

తాను బిజీగా ఉన్నాన‌ని, సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకున్నామ‌ని, రేపు క‌లుస్తామ‌ని చెప్పారు. సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద‌లంద‌రినీ రావాల‌ని ఆహ్వానం పంపించామ‌ని చెప్పారు. ఆ భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్ల శ్రీ‌తేజ్ త్వ‌ర‌గా కోలుకుంటున్నాడ‌ని అన్నారు. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

బాబు, పాప‌తో పాటు తండ్రి భాస్క‌ర్ కు మేలు చేకూర్చేలా చేస్తామ‌న్నారు. అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, దర్శకుడు సుకుమార్ తరఫున రూ.50 లక్షలు, నిర్మాతల తరఫున మరో రూ.50 లక్షల పరిహారం ఇచ్చార‌ని వెల్ల‌డించారు దిల్ రాజు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సైతం త‌న వంతుగా పాప‌కు రూ. 2 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేసులో ఇరుక్కుని బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన జానీ మాస్ట‌ర్ సైతం కిమ్స్ వ‌ద్ద ప్ర‌త్య‌క్షం అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *