ఏపీకి నిధులు మంజూరు చేయండి
కేంద్ర మంత్రికి చంద్రబాబు వినతి
న్యూఢిల్లీ – జేపీ నడ్డా నివాసంలో బుధవారం జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు .కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డాతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పనులు చేపట్టేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రికి జాతీయ హోదా కల్పించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించి కీలక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తక్షణమే బాకీ పడిన నిధులను మంజూరు చేయాలని విన్నవించారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు.
ఈ కీలకమైన ఎన్డీయే సమావేశంలో జేపీ నడ్డాతో పాటు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. మరో వైపు తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినా ఆంధ్రోళ్ల పెత్తనమే కొనసాగుతోందన్న విమర్శలున్నాయి.