NEWSTELANGANA

జేసీహెచ్ఎస్ఎల్ నూత‌న క‌మిటీ

Share it with your family & friends

బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొత్త కార్య‌వ‌ర్గం

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (జేసీహెచ్ఎస్ఎల్ ) కు ఇటీవ‌లే ఎన్నిక‌లు జ‌రిగాయి. మొత్తం మూడు ప్యాన‌ల్స్ పోటీ చేశాయి. వెంక‌టాచారి ప్యాన‌ల్ లో ముగ్గురు బ్ర‌హ్మండ‌భేరి గోప‌రాజు ప్యాన‌ల్ లో ఆరుగురు ఎన్నిక‌య్యారు. దీంతో కీల‌క‌మైన ప‌ద‌వులలో గోప‌రాజు ప్యాన‌ల్ స‌భ్యులు కొలువు తీరారు.

బుధ‌వారం జ‌రిగిన కీల‌క స‌మావేశంలో క‌మిటీ బాధ్య‌త‌లు చేప‌ట్టింది. అధ్య‌క్షుడిగా గోప‌రాజు, ఉపాధ్య‌క్షుడిగా ల‌క్ష్మీ నారాయ‌ణ‌, కార్య‌ద‌ర్శిగా ర‌వీంద్ర‌బాబు, స‌హాయ కార్య‌ద‌ర్శి భాగ్య‌ల‌క్ష్మి, కోశాధికారిగా మ‌హేశ్వ‌ర్ గౌడ్ , డైరెక్ట‌ర్లుగా క‌మలాక‌ర్ ఆచార్య‌, డి. వెంక‌టాచారి, స్వేచ్ఛ వోట్క‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఎన్నిక‌ల అనంత‌రం గెలుపొందిన హ‌ష్మి కూతురు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందింది. దీంతో ఆయ‌న ఇవాళ జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేక పోయారు. ఆయ‌న త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీ మేర‌కు ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్రెసిడెంట్ గోప‌రాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *