స్మితా సబర్వాల్ వెరీ స్పెషల్
పనుల ప్రగతిపై ఫోకస్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ సంచలనంగా మారారు. ఆమె పనిలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటారు. ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్యన గోవాకు కూడా వెళ్లారు. ఇందుకు గాను వీడియోను, ఫోటోలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత ప్రభుత్వంలో కీలకమైన పదవి చేపట్టారు. సీఎంఓలో పని చేశారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆమె ఉండే వారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ , కాళేశ్వరం ప్రాజెక్టు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఒక రకంగా స్మితా సబర్వాల్ ఏం చెబితే అది నడుస్తుందన్న స్థాయికి ప్రచారం జరిగింది.
కానీ కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు కదా. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో స్మితా పొజిషన్ కూడా మారింది. ఆమె అత్యంత సీనియర్ అధికారిణి అయినప్పటికీ ఉన్నట్టుండి అప్రధాన్య పోస్టుకు బదిలీ చేశారు. అయినా స్మితా సబర్వాల్ పట్టించు కోలేదు. సచివాలయంలో ఎప్పటి లాగే విధులు నిర్వహిస్తూ వస్తోంది. ఆమెను కలిసేందుకు ప్రతి రోజూ వస్తున్నారు.