సీఎంపై హరీశ్ రావు కన్నెర్ర
పదవులు వదులుకున్న చరిత్ర
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమపై బురద చల్లేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. పోరాట కాలంలో ఒక్క ఏడాది లోనే పదవులను వదులుకున్న చరిత్ర తమదన్నారు. మీకున్న చరిత్ర ఏమిటో తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసన్నారు తన్నీరు హరీశ్ రావు.
పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీ మారిన చరిత్ర నీకు , నీ మంత్రి వర్గ సభ్యులకి ఉన్నదని సంచలన ఆరోపణలు చేశారు.పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించ లేదని స్పష్టం చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెల్లలోనే అవగాహన రాహిత్యంతో, తొందర పాటుతో మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తినే పరిస్థితికి తీసుకు వచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు చెప్పారంటూ పేర్కొన్నారు.