పేపర్ లీకకు పాల్పడితే జైలుకే
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ – కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఎవరైనా సరే పరీక్షలకు సంబంధించి లీక్ చేసినా లేదా మాన్యుప్ లేట్ చేసినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కోటి రూపాయల దాకా జరిమానా విధిస్తామని, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
లోక్ సభలో ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్ బిల్లు – 2024 ను ప్రవేశ పెట్టారు జితేంద్ర సింగ్. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. గత కొన్నేళ్లుగా ఎక్కో ఒక చోట పేపర్ లీకులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలు లీకేజీల కారణంగా నిలిచి పోయాయి.
పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ తుతూ మంత్రంగా సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. కొత్తగా కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి టీఎస్పీస్సీ చైర్మన్ గా అప్పగించింది .