సీఎం రేవంత్ రెడ్డి నో కాంప్రమైజ్
ప్రభుత్వానికి సహకరించాల్సిందే
హైదరాబాద్ – సినీ రంగ అభివృద్దికి కృషి చేస్తామని కానీ ప్రభుత్వానికి సహకరించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టాలీవుడ్ ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా సంధ్య థియేటర్ ఘటనతో పాటు గద్దర్ అవార్డుకు సంబంధించి చర్చ జరిగింది. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ల రేట్లు పెంచడం కుదరదని, మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
గురువారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కీలక సమావేశం జరిగింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఎస్డీఎఫ్సీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు.
వీరితో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నటులు, నిర్మాతలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు సీఎం . ఇదే సమయంలో గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డుల విషయంలో ఇప్పటికే ఏర్పాటైన నర్సింగ్ రావు కమిటీ సిఫారసులపై కూడా ప్రత్యేకంగా చర్చించారు రేవంత్ రెడ్డి. మొత్తంగా దిల్ రాజు చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్టేనని చెప్పక తప్పదు.