SPORTS

చెస్ ఛాంపియ‌న్ కు త‌లైవా కంగ్రాట్స్

Share it with your family & friends

అభినందించిన శివ కార్తికేయ‌న్

త‌మిళ‌నాడు – అత్యంత పిన్న వ‌య‌సులోనే చెస్ ఛాంపియ‌న్ గా నిలిచి రికార్డ్ సృష్టించిన త‌మిళ‌నాడుకు చెందిన గుకేష్ దొమ్మ‌రాజును ప్ర‌త్యేకంగా అభినందించారు త‌మిళ సినీ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ . త‌న‌కు ఒక యోగి ఆత్మ‌క‌థ పుస్త‌కాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చారు. రాబోయే రోజుల‌లో మ‌రింత పేరు తీసుకు రావాల‌ని ఆకాంక్షించారు. ఇదే స‌మ‌యంలో న‌టుడు శివ కార్తికేయ‌న్ కూడా గుకేశ్ ను అభినందించారు. గుకేశ్ కు అరుదైన బ‌హుమ‌తి ఇచ్చారు.

ఇటీవ‌ల సింగ‌పూర్ లో జ‌రిగిన చెస్ ఛాంపియ‌న్ పోటీలో చైనాకు చెందిన ఆట‌గాడిని ఓడించాడు. చెన్నైలో తొలుత త‌న తండ్రి డాక్ట‌ర్ , త‌ల్లితో క‌లిసి గుకేశ్ ర‌జ‌నీకాంత్ ఇంటికి వెళ్లాడు. వారిని సాద‌రంగా ఆహ్వానించారు త‌లైవా. ఘ‌నంగా స‌న్మానించారు. మీ స‌మ‌యాన్ని వెచ్చించినందుకు, మీ జ్ఞానాన్ని పంచుకున్నందుకు తాను జీవితంలో మిమ్మ‌ల్ని మ‌రిచి పోలేనంటూ పేర్కొన్నాడు గుకేశ్ దొమ్మ‌రాజు ర‌జ‌నీని ఉద్దేశించి.

అక్క‌డి నుంచి మ‌రో ప్ర‌ముఖ న‌టుడు శివ కార్తికేయ‌న్ ఇంటికి వెళ్లారు. గుకేశ్ కు అత్యంత ఖ‌రీదైన వాచీని అంద‌జేశారు బ‌హుమ‌తిగా. ఇదే స‌మ‌యంలో ఛాంపియ‌న్ గా నిలిచినందుకు సీఎం ఎంకే స్టాలిన్ ఏకంగా రూ. 5 కోట్లు ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *