వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ అవుతుంది
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కామెంట్
హైదరాబాద్ – ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయని అన్నారు. హైదరాబాద్ ను వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి తామంతా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. కలిసేందుకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలిపారు . అయితే సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామన్నారు అరవింద్.
హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం కలిశారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ బాసటగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా ఇంటర్నేషనల్ స్టూడియోను ఏర్పాటు చేయాలని సీఎంకు సూచించారు నటుడు అక్కినేని నాగార్జున, దర్శకుడు కె . రాఘవేంద్ర రావు.
వీటన్నింటికి ఆమోదం తెలిపారని వెల్లడించారు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు.