NEWSTELANGANA

ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న లేని సీఎం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న త‌న‌ను టార్గెట్ చేస్తూ తూలనాడిన రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌టం మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు. మంగ‌ళ‌వారం పార్టీకి చెందిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టేందుకు ఢిల్లీకి వెళ్లి క‌లిసి వ‌చ్చారో రేవంత్ రెడ్డి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. బ‌ట్ట కాల్చి మీద వేస్తామంటే ఊరుకుంటామా అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడు కునేందుకు బీఆర్‌ఎస్ ఎంతకైనా తెగిస్తుందని స్ప‌ష్టం చేశారు.

నల్గొండలో ఈనెల‌ 13న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీఆర్‌ఎస్ బీఆర్ఎస్ బాస్ ప్రకటించారు. మా నీళ్లు మాకే అన్న నినాదంతో ముందుకు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. ఇదిలా ఉండ‌గా ఒక బాధ్య‌త క‌లిగిన సీఎం ప‌ద‌విలో ఉన్న రేవంత్ రెడ్డి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.

ఏదానిపైన నైనా మాట్లాడే ముందు ఆ అంశాన్ని గురించి పూర్తిగా తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేసీఆర్. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్ప‌గిస్తే మ‌న‌కంటూ స్వేచ్ఛ ఉండ‌ద‌న్నారు. అప్పుడు ప్ర‌తి నీటి చుక్క కోసం కేంద్రంపై ఆధార‌ప‌డి ఉండాల్సిన దుస్థితి ఏర్ప‌డుతుంద‌న్నారు.