NEWSTELANGANA

రాజ‌కీయ దిగ్గ‌జం మ‌న్మోహ‌న్ సింగ్

Share it with your family & friends

ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన రాజ‌కీయ నేత‌ల‌లో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఒక‌రు అని పేర్కొన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌నతో త‌న‌కు ఎన‌లేని అనుబంధం ఉంద‌న్నారు. ఎంపీగా ఉన్న స‌మ‌యంలో తాను మాజీ పీఎం నుంచి ఎన్నో నేర్చుకున్నాన‌ని గుర్తు చేసుకున్నారు. ఒక ర‌కంగా ఆత్మీయుడిని, మార్గ‌ద‌ర్శిని కోల్పోయాన‌ని వాపోయారు. నివాళిగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇండియాలోనే కాదు యావ‌త్ ప్ర‌పంచంలోనే ఎన్న‌ద‌గిన ఆర్థికవేత్త‌ల‌లో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఒక‌రు అని కొనియాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీయ‌డ‌మే కాదు దేశాన్ని ఇక్క‌ట్ల నుంచి ర‌క్షించిన అరుదైన నాయ‌కుడు అంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి వ్య‌క్తులు అరుదుగా ఉంటార‌ని పేర్కొన్నారు.

సద్గుణం, నిష్కళంకమైన సమగ్రత, నిర్ణయం తీసుకోవడంలో అన్నింటికంటే మానవీయ స్పర్శతో గుర్తించబడిన వ్యక్తి డాక్టర్ సింగ్ అని అన్నారు. కొత్త భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరుగా ఎల్ల‌ప‌ప్ప‌టికీ గుర్తుండి పోతార‌ని ప్ర‌శంసించారు. ఆయ‌న వ్య‌క్తి కాదు ఓ లెజండ్ అంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *