మన్మోహన్ సింగ్ లెజెండ్
మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటి తరానికే కాదు రాబోయే తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన నేతగా గుర్తుండి పోతారని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని అన్నారు.
అరుదైన రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించారు . వినయం, వివేకం, చిత్తశుద్ధి మూర్తీభవించిన మేధావి అని కొనియాడారు. ప్రపంచ ఆర్థికవేత్తలలో అగ్రగణ్యుడని, అంతే కాదు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన నాయకుడని కొనియాడారు . ఇలాంటి నాయకులు అరుదుగా జన్మిస్తారని అన్నారు. ఆయన మృతి దేశానికి , తనకు తీరని లోటు అని స్పష్టం చేశారు.
1991లో ఆర్థిక మంత్రిగా తన ఆర్థిక సంస్కరణల నుండి ప్రధానమంత్రిగా తన నాయకత్వం వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవ చేసి లక్షలాది మందిని ఉద్ధరించారని తెలిపారు.
భారత ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహించిన దూరదృష్టి కలిగిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మృతి చెందడం బాధాకరం అన్నారు.