NEWSNATIONAL

మ‌న్మోహ‌న్ సింగ్ కు పీఎం నివాళి

Share it with your family & friends

అంజ‌లి ఘ‌టించిన అమిత్ షా..న‌డ్డా

ఢిల్లీ – మాజీ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ పార్థివ దేహానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నివాళులు అర్పించారు. శుక్ర‌వారం ఆయ‌న సింగ్ నివాసానికి వెళ్లారు. అక్క‌డ సింగ్ భౌతిక కాయం వ‌ద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజ‌లి ఘ‌టించారు. కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం తెలిపారు. మ‌న్మోహ‌న్ సింగ్ భార్య‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

ప్ర‌ధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాతో ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. దేశం గొప్ప నేత‌ను కోల్పోయింద‌న్నారు పీఎం. ఇదిలా ఉండ‌గా డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌సు 92 ఏళ్లు. ఆద్యంత‌మూ వివాద ర‌హితుడిగా పేరు పొందారు. ప‌దేళ్ల పాటు పీఎంగా ప‌ని చేశారు. ఆర్థిక మంత్రిగా చెర‌గ‌ని ముద్ర వేశారు. సుదీర్ఘ కాలం పాటు ప‌ని చేసిన ప్ర‌ధాన‌మంత్రుల‌లో ఆయ‌న కూడా ఒక‌రు.

త‌న కెరీర్ లో ఎన్నో ఉన్న‌త‌మైన ప‌ద‌వులు నిర్వ‌హించారు. ప్ర‌పంచంలో అత్యున్న‌త‌మైన ఆర్థిక‌వేత్త‌ల‌లో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఉన్నారు. 1982-1985 వరకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్య స‌భ స‌భ్యుడిగా, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న పాత్ర నిర్వ‌హించారు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్.

ఆయ‌న దేశానికి అందించిన విశిష్ట సేవ‌ల‌కు గాను 1987లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం పొందారు. అంతే కాదు 1993లొ ఉత్తమ ఆర్థిక మంత్రిగా అవార్డు అందుకున్నారు. 2017 మన్మోహన్ సింగ్ కు ఇందిరా గాంధి ద‌క్కింది. 13వ భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు యావ‌త్ భార‌త జాతి మొత్తం విన‌మ్రంగా నివాళులు అర్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *