అరుదైన వ్యక్తి మన్మోహన్ సింగ్
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఢిల్లీ – మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయన అజాత శత్రువు అని కొనియాడారు. సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశ చరిత్ర గతిని మార్చిన నేతలలో తను కూడా ఒకరు అని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.
అంతకు ముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఎ. రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ సందర్బంగా సింగ్ వ్యక్తిత్వం గొప్పదని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు.
లెక్చరర్ నుంచి ప్రధాని వరకు ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. భారత నిర్మాణంలో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర అని ప్రశంసలు కురిపించారు. ఆయనతో తనకు ఉన్న బంధాన్ని నెమరు వేసుకున్నారు. గొప్ప వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు.