పేదల పాలిట దేవుడు పీజేఆర్
అరుదైన ప్రజా నాయకుడన్న సీఎం
హైదరాబాద్ – పేదల దేవుడిగా గుర్తింపు పొందారు దివంగత పి. జనార్దన్ రెడ్డి. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా 1978, 1985, 1989, 1994, 2004 లలో వరుసగా గెలిచాడు. మంత్రిగా పని చేశారు. కార్మికుల, అణగారిన వర్గాల పక్షపాతిగా ఉన్నారు. పిలిచే పలికే నాయకుడిగా గుర్తింపు పొందారు. డిసెంబర్ 28న పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయని సీఎం అన్నారు.
జనవరి 12, 1948లో పుట్టారు. ఆయనకు ప్రజలంటే వల్లమాలిన అభిమానం. సరిగ్గా 2007 డిసెంబర్ 28న మృతి చెందారు. ఆయనను అందరూ పీజేఆర్ గా ఆప్యాయంగా పిలుచుకుంటారు. కార్మిక నాయకుడిగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలువడం మామూలు విషయం కాదు.
పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందాడు. సనత్‌నగర్‌లోని ఎపి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్లో సూపర్వైజర్గా పనిచేశాడు పి. జనార్దన్ రెడ్డి. 1967లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు హైదరాబాద్ ఆల్విన్, కేశవ్రామ్ సిమెంట్స్, ఎన్టిపిసి, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వంటి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించాడు.
అసోసియేటెడ్ గ్లాస్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్, ఎపి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్, కృషి ఇంజిన్లకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
1978లో ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అదే నియోజకవర్గం నుండి మరో నాలుగు సార్లు (1985, 1989, 1994, 2004) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గాలలో ఒకటి. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.
1980లో సహకార, యువజన సేవల మంత్రిగా, 1982లో ఆర్కైవ్స్ మంత్రిగా, 1990 నుండి 1992 వరకు కార్మిక, ఉపాధి, గృహనిర్మాణ మంత్రిగా, 1993లో పౌర సరఫరా మంత్రిగా పనిచేశాడు.
1994 – 1999 మధ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నాయకుడిగా ఉన్నాడు. ఎన్‌టి రామారావు, ఎన్.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాదు నగరంలో పలు నిరసనలు చేశాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతునిచ్చాడు. తెలంగాణ ప్రాంతానికి న్యాయమైన నిధుల కోసం పోరాడాడు.