NEWSTELANGANA

సీఎంతో మెయిన్హార్డ్ బృందం భేటీ

Share it with your family & friends

మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు

హైద‌రాబాద్ – సింగ‌పూర్ కు చెందిన మెయిన్హార్డ్ కంపెనీకి చెందిన ప్ర‌తినిధుల బృందం మంగ‌ళ‌వారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను చేపట్టేందుకు తమ ఆసక్తిని ప్రదర్శించారు. వివిధ దేశాల్లో తమ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మెయిన్ హార్ట్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

అనంత‌రం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మెయిన్హార్డ్డ్ టీమ్ ను అభినందించారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా దీనిని చేప‌ట్టేందుకు నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. కంపెనీకి సంబంధించి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు కావాల‌న్నా తాము అంద‌జేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు వ‌ల్ల ఉపాధి ల‌భిస్తుంద‌ని, న‌గ‌రం మ‌రింత అభివృద్ది చేందేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు రేవంత్ రెడ్డి.