కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్ తో పాటు పూజారులు స్వాగతం పలికారు. అనంతరం రూ. 39.15 కోట్లతో చేపట్టే ధర్మాశాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ప్రమాదం నుంచి అంజన్నే కన్ను కాపాడారని చెప్పారు.
ఒక రకంగా ఇవాళ మీ ముందు ఉన్నానంటే దానికి కారణం కొండగట్టు అంజన్నే కారణమని పేర్కొన్నారు.
ఒక రకంగా కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చిందని చెప్పారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్. దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని నన్ను కోరారని అన్నారు. భక్తులు కోరుకున్న బలమైన సంకల్పమిదని స్పష్టం చేశారు. టీటీడీ, తెలంగాణ నేతల అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా గిరిప్రదక్షిణకు నా వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు.







