NEWSANDHRA PRADESH

జగన్ ను నమ్ముకుంటే జైలుకే

Share it with your family & friends

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌ర్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. జ‌గ‌న్ ఇక ఇంటికి వెళ్లే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. ఆయ‌న‌ను న‌మ్ముకుంటే జైలుకు పోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా క‌ద‌లిరా అంటూ ఏర్పాటు చేసిన స‌భ‌లో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగించారు.

చని పోయిన తండ్రిపై ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి జగన్ అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని. కావాలనే వారిలో అభద్రతా భావం సృష్టిస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ, వైసీపీ కి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. వాలంటీర్లకు రాజకీయాలొద్దు. మంచి పనులు చేసే వారికి సహకరిస్తామని చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు.

భవిష్యత్‌లో కోతలు లేని నాణ్యమైన విద్యుత్తు అందిస్తామ‌న్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా జీవిత ఆశయమ‌న్నారు. పెరిగిన సంపద పేదలకు చేరాలనేది త‌న సంక‌ల్పంమ‌ని చెప్పారు .