శరద్ పవార్ కు ఎదురు దెబ్బ
అజిత్ పవార్ దే అసలైన ఎన్సీపీ
న్యూఢిల్లీ – భారత దేశ రాజకీయాలలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఎన్సీపీకి సంబంధించి ఎన్నికల గుర్తు విషయంలో కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీ నుంచి విడి పోయి వేరు కుంపటి పెట్టారు ఎన్సీపీకి చెందిన సీనియర్ నాయకుడు అజిత్ పవార్. ఆయన ప్రస్తుతం మరాఠాలో అధికారంలో ఉన్న శివసేన షిండేలో చేరారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.
పలువరు ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని, తనదే అసలు సిసలైన ఎన్సీపీ అని ఈ మేరకు అజిత్ పవార్ కోర్టును, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఆధారాలతో సహా పత్రాలను అందజేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది కోర్టు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్ కు చెందినది కాదని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ కు చెందినదని స్పష్టం చేసింది.
దీంతో అవాక్కయ్యారు శరద్ పవార్. ఓ వైపు త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో ఉన్నట్టుండి ఇండియా కూటమిలో ఒక భాగంగా ఉన్న ట్రబుల్ షూటర్ కు కోలుకోలేని దెబ్బ తగలడం విచిత్రం కదూ.