త్వరలోనే 2 లక్షల జాబ్స్ భర్తీ
హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ వెంకట్
హైదరాబాద్ – త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రస్తుతం ప్రజా పాలన కొనసాగుతోందన్నారు.
ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా విద్యార్థులతో మేధావుల సదస్సు జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులు, నిరుద్యోగుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఎన్ఎస్ యుఐ ఓయూ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కార మార్గాలు పేరుతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
గ్రూప్స్ పరీక్షలు, మెగా DSC, GO 46, ఉపాధి కల్పన పై ప్రభుత్వ విధి విధానాలు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు , ఇతర అనేక విద్యార్ధి ఉద్యోగ అభ్యర్థుల అంశాల పై విద్యార్థులు, నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు బల్మూరి వెంకట్.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణిని తుంగలో తొక్కి, కాంగ్రెస్ ప్రజా పాలన విధానాన్ని అనుసరించి తాను విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకున్నానని , సీఎం రేవంత్ రెడ్డికి వివరించానని తెలిపారు .