బీఆర్ఎస్ సభకు ఎస్పీ ఓకే
13న భారీ బహిరంగ సభ
నల్లగొండ జిల్లా – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈనెల 13న నల్లగొండ జిల్లాలో తలపెట్టిన సభకు అనుమతి లభించింది. ఎట్టకేలకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి కీలక ప్రకటన చేశారు. అయితే అంతకు ముందు నెల రోజుల పాటు బహిరంగ సభలకు ఎలాంటి అనుమతి లేదని, 30, 30 ఏ యాక్ట్ మలు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, ర్యాలీలు చేయడం కుదరదని తేల్చి చెప్పారు.
కానీ అంతలోనే ఏమైందో ఏమో కానీ బీఆర్ఎస్ సభ నిర్వహించేందుకు ఓకే చెప్పారు ఎస్పీ చందనా దీప్తి. ఆమె తీసుకున్న నిర్ణయంపై గులాబీ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ సందర్బంగా తీపి కబురు చెప్పారు.
అయితే ముందుకు ఎందుకు లేదని చెప్పిందో ఎస్పీకే తెలియాలి. మరో వైపు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. అయితే ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అనుమతించారని ఆరోపించారు కేసీఆర్. ప్రాజెక్టులను కేంద్రానికి తాకట్టు పెట్టవద్దంటూ డిమాండ్ చేస్తూ నల్లగొండలో సభ నిర్వహించాలని తలపెట్టారు గులాబీ బాస్.