యుఎస్ లో విద్యార్థులకు భద్రత కల్పించాలి
కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విన్నపం
హైదరాబాద్ – చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులపై రోజురోజుకు దాడులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. పలు సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే స్టూడెంట్ పై చికాగోలో కొందరు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు. ఓహియోలో శ్రేయాస్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారని తెలిపారు సీఎం. ఈ సందర్భంగా వెంటనే కేంద్ర సర్కార్ అమెరికాలోని భారత దేశానికి చెందిన విద్యార్థులకు భద్రత కల్పించే విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధానంగా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి. యుఎస్ఏతో పాటు ఇతర దేశాలలో నివవిస్తున్న తెలంగాణ విద్యార్థులకు పూర్తి భరోసా ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం తరపున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి కావాల్సిన సహాయం అందజేస్తామన్నారు.