కేంద్రంపై కన్నడిగుల కన్నెర్ర
మోదీ సర్కార్ బక్వాస్
న్యూఢిల్లీ – కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు వేలాది మంది కన్నడ ప్రాంతానికి చెందిన నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈ సంరద్బంగా సీఎం సిద్దరామయ్య ప్రసంగించారు. కేంద్రం కావాలని తమ పట్ల , ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయ బద్దంగా రావాల్సిన వాటాను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. దేశంలోని 143 కోట్ల ప్రజలకు తాము ఎలా మోసానికి గురవుతున్నామనో, ఎంతటి వివక్ష అనుభవిస్తున్నామనే దాని గురించి తెలియ చెప్పేందుకే ఇక్కడ ఆందోళన చేపట్టామని చెప్పారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ కేంద్రం రాచరిక ధోరణితో ఉందన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు, వివిధ బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.