NEWSANDHRA PRADESH

ఎవ‌రి కోసం దేని కోసం సిద్ధం

Share it with your family & friends

జ‌గ‌న్ రెడ్డిపై ష‌ర్మిలా రెడ్డి ఫైర్

బాప‌ట్ల – ఏం సాధించారని, ఏం చేశార‌ని ఏపీ ప్ర‌జ‌లు మీ కోసం సిద్దం కావాలంటూ నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె బాప‌ట్ల‌లో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్ర‌ధానంగా త‌న సోద‌రుడిని టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. నిన్న‌టి దాకా తాను నిర్మించుకున్న కోట‌లోనే ఉన్నాడ‌ని, బ‌య‌ట‌కు రాలేద‌ని, ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని ప్ర‌జ‌ల జ‌పం చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు వైఎస్ ష‌ర్మిల‌.

ప్ర‌జ‌లు జ‌గ‌న్ రెడ్డిని క్ష‌మించే ప‌రిస్థితుల్లో లేర‌న్నారు. ఇప్ప‌టికే ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని మ‌రోసారి అధికారాన్ని అప్ప‌గిస్తే తిరిగి రూ. 8 ల‌క్ష‌ల కోట్లు అప్పులు తీసుకు వ‌చ్చేందుకా అని నిల‌దీశారు.
బీజేపీతో ఎందుకు పోరాడ లేక పోతున్నారంటూ ప్ర‌శ్నించారు. మ‌ళ్లీ అక్ర‌మంగా పొత్తు కుదుర్చుకునేందుకా అని అన్నారు. ఏం సాధించార‌ని మీకు ఓటు వేయాల‌ని మండిప‌డ్డారు.

ఈ రాష్ట్రంలో ఎవ‌రికి ఓటు వేసినా అది భార‌తీయ జ‌న‌తా పార్టీకి, మోదీకి వెళుతుంద‌న్నారు. ఇన్నేళ్ల‌యినా ఎందుకు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదో ఒక్క‌సారైనా నిల‌దీశారా అని ఫైర్ అయ్యారు ష‌ర్మిలా రెడ్డి. మ‌ద్య నిషేధం అన్నారు అది ఏరులై పారుతోంద‌న్నారు.

25 ల‌క్ష‌ల ఇళ్లు క‌డ‌తామ‌న్నారు ఇప్ప‌టి దాకా పూర్తి కాలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. లిక్క‌ర్, మైనింగ్ మాఫియాకు సిద్దం అయ్యేందుకు మీకు ఓటు వేయాలా అని ఆరోపించారు. మీరు సిద్ద‌మైతే ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నార‌ని హెచ్చ‌రించారు.