మీ రుణం తీర్చుకోలేను
సీఎం చెంపై సోరేన్
జార్ఖండ్ – సీఎం చెంపై సోరేన్ భావోద్వేగానికి లోనయ్యారు. పేద కుటుంబం నుంచి వచ్చిన చెంపై ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు పేదలతో దగ్గరి అనుబంధం ఉంది. వాళ్లతో పాటే కలిసి ప్రయాణం చేస్తూ వచ్చారు ఇంత కాలం. కానీ అనుకోకుండా తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఊహించని పరిణామం.
దేశ వ్యాప్తంగా జార్ఖండ్ గురించి చర్చ జరిగింది. ఇందుకు కారణం అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సారథ్యంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. దీని వెనుక ప్రధాన మంత్రి మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా , జేపీ నడ్డా ఉన్నారని జేఎంఎం ఆరోపిస్తూ వచ్చింది.
కేంద్ర సర్కార్ పనిగట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐలను కావాలని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు వాడుకుంటూ వస్తోందని మాజీ సీఎం హేమంత్ సోరేన్ ఆరోపించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. దీంతో జార్ఖండ్ లో సర్కార్ కూలి పోతుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బులకు లొంగి పోలేదు.
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో అత్యధిక మెజారిటీ సాధించి తిరిగి ప్రభుత్వం నెలకొల్పేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు సీఎం చెంపై సోరేన్.