వీక్షణం ఎడిటర్ ఇంట్లో సోదాలు
రంగంలోకి దిగిన ఎన్ఐఏ
హైదరాబాద్ – జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించింది. ప్రముఖ జర్నలిస్ట్ , వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. వేణుగోపాల్ ప్రముఖ విప్లవ కవి వరవరరావు అల్లుడు కావడం విశేషం. గత కొంత కాలం నుంచి ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తూ వస్తున్నారు.
మావోయిస్టులతో వేణుగోపాల్ కు సత్ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయని, అందులో భాగంగానే ఎన్ఐఏ హిమాయత్ నగర్ లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు చేపట్టింది. అంతే కాకుండా ఎల్బీ నగర్ లో ఉన్న శర్మ నివాసంలో కూడా తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ.
ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచీ ఎన్ . వేణుగోపాల్ వీక్షణం పేరుతో మాస పత్రికను నిర్వహిస్తూ వస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు తన మామ వరవరరావును దేశ ద్రోహం కింద కేసు పెట్టారు. ఆయన జైలులోనే ఉన్నారు.
మొన్నటి దాకా బెయిల్ ఇచ్చేందుకు చాలా ఇబ్బందులు పెట్టారు. తాజాగా ఎన్ఐఏ సోదాలు జరపడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఆయన ఇంటి చుట్టూ ఎవరినీ రాకుండా చూశారు. ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.