అమిత్ షాతో చంద్రబాబు భేటీ
బీజేపీతో పొత్తు కోసం తహతహ
న్యూఢిల్లీ – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ను వ్యక్తిగతం కలిశారు. రాష్ట్రంలో త్వరలో శాసన సభ , లోక్ సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగానే చంద్రబాబు విస్తృతంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూటమిగా ఏర్పాటయ్యారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. ఇదే క్రమంలో పవన్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
చర్చల్లో భాగంగా గంటకు పైగా అమిత్ చంద్ర షాతో చంద్రబాబు నాయుడు చర్చించారు. బీజేపీతో కలిస్తే ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. గతంలో సీఎంగా ఉన్న సమయంలో బీజేపీతో సత్ సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. 2019 ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదురైంది.
ప్రస్తుతం తిరిగి బీజేపీ గూటికి చేరేందుకు నానా తంటాలు పడుతున్నారు.