జన సైనికులు కుటుంబ సభ్యులు
స్పష్టం చేసిన నాదెండ్ల మనోహర్
అమరావతి – పార్టీ కోసం కష్ట కాలంలో పని చేసిన కార్యకర్తలు, నేతలకు తమ నాయకుడు అండగా ఉంటాడని ప్రకటించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తమ పార్టీకి 6 లక్షల 30 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు.
ఇప్పటి దాకా వివిధ కారణాల రీత్యా , అనుకోని సంఘటనల్లో మొత్తం 226 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు మనోహర్. ఇందులో భాగంగా తమ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను, వారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించారని, ఆ మేరకు ఇప్పటికే తాము బీమా సదుపాయం కూడా కల్పించడం జరిగిందన్నారు.
మరణించిన కార్యకర్తలు, నేతల కుటుంబాలకు మొత్తం రూ. 10.3 కోట్ల బీమా సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు నదెండ్ల మనోహర్. అంతే కాకుండా 320 మందికి మెడికల్ రీ ఎంబర్స్మెంట్ సొమ్ము రూ.2 కోట్ల వరకు అందించామని చెప్పారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడి అనుకోని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్భించడం జరిగిందన్నారు. ఇది తమ బాధ్యత అని మరోసారి స్పష్టం చేశారు.