జగన్ మోసం ఏపీకి శాపం
వైస్ షర్మిలా రెడ్డి ఫైర్
గుంటూరు జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నవ రత్నాల పేరుతో జనాన్ని మోసం చేశారని ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలకనూరు ఊరులో రచ్చ బండ చేపట్టారు. ఈ సందర్బంగా షర్మిల ప్రసంగించారు.
ప్రభుత్వ పథకాలు ఏవీ ప్రజలకు అందడం లేదని వాపోయారు. ఉద్యోగాలు లేవు..ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేక పోవడం దారుణమన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి చెవుల్లో పూలు పెట్టారంటూ మండిపడ్డారు షర్మిల.
మెగా డీఎస్సీ అని పేరు చెప్పి దారుణంగా మోసం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు 7 వేల పోస్టులు ఇస్తే హేళన చేశారని తాము పవర్ లోకి వస్తే 25 వేల జాబ్స్ ఇస్తామని మాట తప్పారంటూ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కేవలం 6 వేల పోస్టులకు పచ్చ జెండా ఊపారని, నిరుద్యోగులు ఊరుకోరని హెచ్చరించారు.
ఇక్కడి బిడ్డలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్. 25 లక్షల ఇళ్లన్నారు ఒక్కటి కూడా ఇప్పటి దాకా పూర్తి కాలేదన్నారు. జగన్ అన్నది దగా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు .