NEWSTELANGANA

క‌విత‌పై కొండా సురేఖ క‌న్నెర్ర

Share it with your family & friends

మ‌హేంద‌ర్ రెడ్డిపై విమ‌ర్శ‌లు త‌గ‌దు

హైద‌రాబాద్ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ క‌విత‌పై మండిప‌డ్డారు. గురువారం ఆమె అసెంబ్లీ పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ మ‌హేంద‌ర్ రెడ్డిని త‌ప్పించాల‌ని కోరుతున్న క‌విత ఎందుక‌ని ప‌దేళ్ల పాటు డీజీపీగా పెట్టుకున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

టీడీపీలో ప‌ని చేసిన పాల్వాయి ర‌జ‌నిని ఎలా నియ‌మించార‌ని అడ‌గ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కాద‌న్నారు. క‌విత మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంద‌న్నారు. బీఆర్ఎస్ హ‌యాంలో వాళ్లు ఏం చేశారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు .

ఆంధ్రా వాళ్ల‌ను కాంట్రాక్టుల‌ను పెంచి పోషించింది కేసీఆర్ అని ఆరోపించారు. మ‌హేంద‌ర్ రెడ్డి అవినీతి అధికారి అయితే ఇంత కాలం డీజీపీగా ఎందుకు పెట్టారంటూ మండిప‌డ్డారు. సింగ‌రేణిలో ఉద్యోగాలు ఇస్తే త‌ప్పు ప‌ట్ట‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

టీఆర్ఎస్ దళారులు సింగ‌రేణిలో జాబ్స్ పొందడం నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ఏడాదిలో 2 ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ చేస్తామ‌న్నారు. మీ హ‌యాంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వ‌లేదంటూ నిల‌దీశారు సురేఖ‌.