జగన్ పాలనలో జనం బెంబేలు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
తెనాలి – వైఎస్ జగన్ పాలనలో జనం ఆగమాగం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. తెనాలి నియోజకవర్గం కొలకనూరు ఊరులో రాజన్న రచ్చ బండ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. నవ రత్నాలు పేరుతో జనాన్ని మోసం చేసిన తీరు దారుణమన్నారు వైఎస్ షర్మిల.
వారంతా కంటతడి పెట్టారని ఇది తనను కలిచి వేసిందన్నారు. జగనన్న ఏమో తమ పాలన అద్భుతం అని అంటున్నారని కానీ .ప్రజలేమో పరమ చెత్తగా ఉంటుందని వాపోతున్నారని పేర్కొన్నారు. పింఛన్ రావడం లేదని.. ఇండ్లు లేవని బాధపడుతున్నారని వాపోయారు. ఉపాధి దొరకటం లేదని కంట తడి పెట్టడం కలిచి వేసిందన్నారు వైఎస్ షర్మిల.
యువతకు ఉద్యోగాలు లేక పోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారని. నిత్యవసర వస్తుల ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రోడ్లు కూడా లేవని , వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలే గట్టి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాటిస్తున్నాని చెప్పారు. గత రెండు ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలను కూడా పరిష్కారిస్తామని హామి ఇచ్చారు. భూ హక్కుల చట్టం పేరుతో సర్కార్ భూ కబ్జాలకు పాల్పడే చట్టం తీసుకురావాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికే లిక్కర్ ను బిజినెస్ చేసి..రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం దోచేశారని ఆరోపించారు.