తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ – సీఎంగా రేవంత్ రెడ్డి కొలువు తీరాక ఆంధ్రోళ్ల పెత్తనం పెరిగి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో ఇటీవల రాష్ట్ర సర్కార్ ముగ్గురిని నియమించిందని అన్నారు. ఈ ముగ్గురు విచిత్రం ఏమిటంటే తెలంగాణకు చెందిన వారు కాదని ఆరోపించారు. వీరంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారని ఆరోపించారు కవిత.
పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆయన మూలాలన్నీ తెలుగుదేశం పార్టీకి చెందినవే అయి ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. దీనిని తెలంగాణ ప్రజలు సమర్థించరని స్పష్టం చేశారు. మరో వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం పూర్తిగా విరుద్దంగా జరిగిందని ధ్వజమెత్తారు కల్వకుంట్ల కవిత.
ఆయనపై అంతులేని రీతిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని , హైకోర్టు న్యాయవాది రాపోలు బాస్కర్ ఆరోపించారని, ఆధారాలతో సహా గవర్నర్ తమిళి సైకి అందజేశారని దీనిపై ఏమంటారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.