జగన్ ఎవరికి పులి..ఎవరికి సింహం
షాకింగ్ కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తన సోదరుడు ఏపీ సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్ రెడ్డిని పదే పదే పులి అని, సింహంగా అభివర్ణిస్తున్నారని ఆయన ఎవరికి పులి, ఎవరికి సింహం అని ప్రశ్నించారు.
ఈ పొగడటం మానేయాలని, సాక్షి పేపర్ కి పులినా లేక సోషల్ మీడియాకి సింహమా అని నిలదీశారు. ఒక్కసారి బీజేపీ మీద విప్పండి మీ పంజా అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే బీజేపీపై గాండ్రించాలని సవాల్ విసిరారు.
జగన్ రెడ్డిని ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారని, రాచరిక పాలన సాగదన్నారు. ఇది ఎన్నటికీ చెల్లదన్నారు. నిలదీస్తే సమాధానం చెప్పాల్సిన ఏపీ సర్కార్ తిరిగి బెదిరింపులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు.
.సొంత ఆడబిడ్డ మీద బూతులు మాట్లాడుతున్నారు..బజారుకు ఈడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు చేయడం మానుకోవాలని సూచించారు. వైసీపీకి సాధ్యమైంది ఇది మాత్రమేనని, కానీ రాష్ట్ర ప్రయోజనాలు సాధించు కోవడం చేత కాదన్నారు.