పీఎం మోదీతో జగన్ భేటీ
పీవీకి భారత రత్న ఇవ్వడం గ్రేట్
న్యూఢిల్లీ – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి న్యూఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. శుక్రవారం సీఎం ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి ఏపీకి చెందిన దివంగత మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ) కు మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైన ప్రథమ పురస్కారం భారత రత్న ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది తెలుగు వారందరికీ దక్కిన అద్బుతమైన గౌరవమని పేర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఆయన మరణాంతరం ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో భారత దేశాన్ని కాపాడిన ఘనత , ప్రముఖ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు పీవీ నరసింహారావు అని ప్రశంసలు కురిపించారు జగన్ మోహన్ రెడ్డి.
ఉన్నతమైన రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందడం ద్వారా తెలుగు మాట్లాడే ప్రజలందరికీ శుభ దినంగా స్పష్టం చేశారు . ఇదే సమయంలో రైతుల కోసం పాటు పడిన మాజీ పీఎం చౌదరి చరణ్ సింగ్ , హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న ప్రదానం చేయడం యావత్ జాతికి గర్వ కారణమని పేర్కొన్నారు.