టీడీపీ..జనసేన కూటమి గెలుపు ఖాయం
జోష్యం చెప్పిన పార్టీ కీలక నేత నాగ బాబు
విశాఖపట్టణం – ఏపీలో జగన్ పాలనకు చరమ గీతం పాడేందుకు జనం సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు జనసేన పార్టీ కీలక నేత నాగ బాబు . శుక్రవారం విశాఖ పట్టణం సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు నాగ బాబు.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్ప కూలాయని, నవ రత్నాలు పేరుతో ప్రజలను మోసం చేశారని, కానీ ఇప్పుడు జనం మోస పోయేందుకు సిద్దంగా లేరన్నారు. ప్రజలు తమను ఆశీర్వదించేందుకు సిద్దంగా ఉన్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.