NEWSTELANGANA

సంతోష్ రావుపై జూప‌ల్లి కామెంట్స్

Share it with your family & friends

పెగ్గులు పోసినందుకు సీటు ఇచ్చారు

హైద‌రాబాద్ – రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వంపై , బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. శాస‌న మండ‌లిలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏం అర్హ‌త ఉంద‌ని జోగిన‌ప‌ల్లి సంతోష్ రావుకు రాజ్య స‌భ సీటు ఇచ్చారో చెప్పాల‌ని నిల‌దీశారు.

శాస‌న మండ‌లి లోనే కాదు శాస‌న స‌భ‌లో సైతం బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు జూప‌ల్లి. గ‌తంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కు పెగ్గులు పోసిన వ్య‌క్తి సంతోష్ రావు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స‌భా మ‌ర్యాద పాటించ లేద‌న్నారు. సంతోష్ కుమార్ ఏ కోశాన ఎంపీకి స‌రి పోడంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ పేరుతో 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ చేసింది ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. దాచు కోవ‌డం దోచు కోవ‌డం అనేది ప‌రిపాటిగా మారేలా చేసిన ఘ‌న‌త కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు.

ఉమ్మ‌డి ఏపీలో జ‌ర‌గ‌ని మోసం తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు