NEWSNATIONAL

స్వామి నాథ‌న్ భార‌త ర‌త్నం

Share it with your family & friends

కొనియాడిన ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త దేశానికి విశిష్ట సేవ‌లు అందించిన వ్య‌క్తుల‌కు దేశం గ‌ర్వించే అత్యున్న‌త పౌర పుర‌స్కారం భార‌త ర‌త్న‌ను ప్ర‌క‌టించింది. దివంగ‌త ప్ర‌ధాన మంత్రి , రైతు బాంధ‌వుడు చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ , మాజీ ప్ర‌ధాన మంత్రి దివంగ‌త పాముల‌ప‌ర్తి న‌ర‌సింహారావు, త‌మిళనాడుకు చెందిన హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ కు భార‌త ర‌త్న ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కురు వృద్దుడు , మాజీ దేశ ఉప ప్ర‌ధాన మంత్రి లాల్ కృష్ణ అద్వానీకి కూడా భార‌త ర‌త్న ప్ర‌క‌టించింది. ఈసారి భార‌త ర‌త్న అవార్డును బీహార్ కు చెందిన ఠాకూర్ కు కూడా కేటాయించింది.

మొత్తంగా దేశానికి అత్యున్న‌త సేవ‌లు అందించిన వారికి ఈ పౌర పుర‌స్కారం అంద‌జేయ‌డం ప‌ట్ల త‌న‌కు ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వ్యవసాయం, రైతుల సంక్షేమంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయమ‌ని పేర్కొన్నారు. భారతదేశం వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.