జర్నలిస్టులకు సీఎం భరోసా
టీయూజేఎస్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టియూజెఎస్ కన్వీనర్ ఎం.ఎం.రహమాన్ తెలిపారు.
ముఖ్యమంత్రి తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరిస్తూ ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా సీఎంకు రహమాన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎవఓం చీఫ్ పిఆర్‌ఓ అయోధ్యరెడ్డిలకు ఉద్యమ సంఘం నేతలు ధన్యావాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేతలు మునీర్, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్, పసూనూరి రవీందర్, తాటికొండ రమేష్ బాబు, సాధిక్, ఖాసిపేట నరేందర్ తదితరులు పాల్గొన్నారు.