ENTERTAINMENT

లాల్ స‌లామ్ సెన్సేష‌న్

Share it with your family & friends

కొత్త ఏడాదిలో త‌లైవా రికార్డ్

త‌మిళ‌నాడు – సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొత్త ఏడాదిలో మ‌రో రికార్డు సృష్టించే దిశ‌గా సాగుతున్నాడు. గ‌త ఏడాది జైల‌ర్ తో దుమ్ము రేపాడు. ప్ర‌స్తుతం విడుద‌లైన లాల్ స‌లామ్ మూవీ ఏకంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్ర‌త్యేక‌త ఏమిటంటే భార‌త క్రికెట్ జ‌ట్టుకు తొలిసారి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చిన మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ అతిథి పాత్ర‌లో న‌టించ‌డం.

లాల్ స‌లామ్ చిత్రాన్ని రూ. 90 కోట్ల దాకా ఖ‌ర్చు చేసి తీసిన‌ట్లు సమాచారం. ఇది ఫ‌క్తు భార‌తీయ త‌మిళ భాషా స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య రజ‌నీకాంత్. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సుభాస్క‌రన్ అల్లి రాజా నిర్మించారు.

త‌లైవాతో పాటు విష్ణు విశాల్ , విక్రాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌ను విఘ్నేష్ , లివింగ్ స్ట‌న్ , సెంథిల్ , జీవిత‌, కేఎస్ ర‌వి కుమార్ , తంబి పోషించారు.