ఏపీ సర్కార్ గంజాయికి కేరాఫ్
నిప్పులు చెరిగిన నాగ బాబు
అమరావతి – జనసేన పార్టీ సీనియర్ నాయకుడు , ప్రముఖ నటుడు నాగ బాబు నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని, దోచు కోవడం దాచు కోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు.
నవ రత్నాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని బిర్యానీ ప్లేట్ లా చేశారని, వైసీపీ నాయకులు మింగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాగ బాబు. అంతే కాదు ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గంజాయికి కేరాఫ్ గా ఏపీని మార్చేసిన ఘనత సీఎం జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
మాడుగుల ప్రాంతంలో 6 రిజర్వాయర్లు ఉన్నా రైతుల కష్టాలు తీరడం లేదన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. గుంతలమయమైన రోడ్లతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని వాపోయారు నాగ బాబు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. తాము వచ్చాక సరి చేస్తామన్నారు .