ఇండియా కంటే ముఖ్య‌మైన దేశం మ‌రొక‌టి లేదు

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అమెరికా రాయ‌బారి

న్యూఢిల్లీ : ఇండియా, అమెరికా దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న సుంకం విధింపుల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌ల న‌డుమ అమెరికా రాయ‌బారి సెర్గియా గోర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న భార‌త దేశం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇండియా కంటే ముఖ్య‌మైన దేశం మ‌రోటి లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు.
నిజమైన స్నేహితులు విభేదించవచ్చు, కానీ చివరికి వారి విభేదాలను ఎల్లప్పుడూ పరిష్కరించు కుంటార‌ని ఆ న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు . ఆయ‌న ప్ర‌త్యేకంగా భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మ‌ధ్య స్నేహం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఇదిలా ఉండ‌గా భారతదేశంలో కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. అనంత‌రం త‌ను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేయడంలో ఇరుపక్షాలు చురుకుగా నిమగ్నమై ఉన్నాయని అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. కాబట్టి దీన్ని ముగింపు రేఖను దాటడం అంత తేలికైన పని కాదు, కానీ మేము అక్కడికి చేరుకోవాలని నిశ్చయించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. మా సంబంధానికి వాణిజ్యం చాలా ముఖ్యమైనదే అయినప్పటికీ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, శక్తి, సాంకేతికత, విద్య , ఆరోగ్యం వంటి ఇతర ముఖ్యమైన రంగాలపై తాము క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *