నెట్టింట్లో ఎస్ జై శంకర్ వైరల్
సోషల్ మీడియాలో హల్ చల్
న్యూఢిల్లీ – భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆయన వల్ల భారత దేశానికి ఎనలేని పేరు తీసుకు వచ్చింది. అంతే కాదు నిత్యం ఇండియాతో యుద్దానికి సిద్దం అంటూ పదే పదే ప్రకటించే పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా సుబ్రమణ్యం జై శంకర్ గురించి పదే పదే ప్రస్తావించారు.
ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో సత్ సంబంధాలను నెరవేర్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. ఐక్య రాజ్య సమితిలో భారత దేశం తరపున వాయిస్ వినిపించడంలో ముందంజలో ఉన్నారు.
ప్రత్యేకించి తటస్థ వైఖరిని అవలంభించడంలో ప్రయత్నం చేశారు. తాజాగా భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో హల్ చల్ గా మారారు. రేయాన్ గ్లాస్ లను ధరించిన జై శంకర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.