NEWSTELANGANA

తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన భ‌ట్టి

Share it with your family & friends

వ్య‌వ‌సాయ రంగానికి అప్ర‌ధాన్య‌త

హైద‌రాబాద్ – తెలంగాణ శాస‌న స‌భ‌లో శ‌నివారం డిప్యూటీ సీఎం , ఆర్థిక శాఖ మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు స‌మావేశ‌మైంది కేబినెట్. ఏక‌గ్రీవంగా భ‌ట్టి త‌యారు చేసిన బ‌డ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈ స‌మావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన రంగ‌మైన వ్య‌వ‌సాయ శాఖ‌కు త‌క్కువగా కేటాయింపులు జ‌ర‌ప‌డం విస్తు పోయేలా చేసింది. అత్య‌ధికంగా పంచాయ‌తీరాజ్ శాఖ‌కు కేటాయించ‌డం విశేషం. ఇక భ‌ట్టి ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో శాఖ‌ల వారీగా చూస్తే ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 2,543 కోట్లు, ఐటీ శాఖకు రూ. 774 కోట్లు, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ఏకంగా రూ. 40,080 కోట్లు కేటాయించారు.

ఇక పుర‌పాలిక శాఖ‌క‌కు రూ. 11,692 కోట్లు, మూసీ రిఫ‌ర్ ప్రాజెక్టుకు రూ. 1,000 కోట్లు, వ్యవ‌సాయ శాఖ‌కు రూ. 19,746 కోట్లు కేటాయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల గురుకుల భ‌వ‌నాల నిర్మాణాల కోసం రూ. 1250 కోట్లు , ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 13,013 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు కేటాయించారు.