NEWSTELANGANA

బీసీ సంక్షేమానికి రూ. 8 వేల కోట్లు

Share it with your family & friends

రూ. రెవిన్యూ లోటు రూ. 2,01,178 కోట్లు

హైద‌రాబాద్ – తెలంగాణ శాస‌న స‌భ‌లో శ‌నివారం డిప్యూటీ సీఎం , ఆర్థిక శాఖ మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. మొత్తం రూ. 2,75,891 కోట్ల‌తో బ‌డ్జెట్ ను రూపొందించారు. ఇందులో మూల ధ‌న వ్య‌యం రూ. 29,669 కోట్లు ఉండ‌గా ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు కేటాయించారు. ఇక రెవిన్యూ ఖ‌ర్చు రూ. 2,01,178 కోట్లు గా ఉంద‌ని ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు.

ఇక శాఖ‌ల వారీగా చూస్తే బ‌డ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా వేసింది. ఇక ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 2,543 కోట్లు, ఐటి శాఖకు 774 కోట్లు, పంచాయ‌తీ రాజ్ శాఖ‌కు రూ. 40,080 కోట్లు, పుర‌పాలిక శాఖ‌కు రూ. 11,692 కోట్లు, మూసీ రివ‌ర్ ఫ్రాంట్ కు రూ. 1,000 కోట్లు కేటాయించింది.

ఇక వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ. 19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భ‌వ‌నాల కోసం రూ. 1250 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 13013 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు, బీసీ సంక్షేమం, బీసీ గురుకులాల భ‌వ‌న నిర్మాణాల కోసం రూ. 1546 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 8 వేల కోట్లు కేటాయించారు.

విద్యా రంగానికి రూ .21,389 కోట్లు, తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు, యూనివ‌ర్శిటీల్లో స‌దుపాయాల కోసం రూ. 500 కోట్లు, వైద్య రంగానికి రూ. 11,500 కోట్లు, విద్యుత్ గృహ జ్యోతికి రూ. 2,418 కోట్లు, విద్యుత్ సంస్థ‌ల‌కు రూ. 16,285 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 7,740 కోట్లు, నీటి పారుద‌ల శాఖ‌కు రూ. 28024 కోట్లు కేటాయించారు.