బాబు..జగన్ దొందూ దొందే
నిప్పులు చెరిగిన జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి – జై భారత్ పార్టీ చీఫ్ , మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తుల ధ్యాస తప్ప రాష్ట్ర బాగోగుల గురించి ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు.
ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి, గతంలో సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒక్కటేనని మండిపడ్డారు. ఇద్దరూ ఒక్కటేనని వీరంతా ఏనాడైనా ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిలదీశారా అని సీరియస్ అయ్యారు.
ఎవరి ప్రయోజనాల కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప 5 కోట్ల మంది ప్రజల స్థితి గతుల గురించి ఆలోచించడం లేదన్నారు. ఉన్న వనరులను ఉపయోగించు కోవడంపై ఫోకస్ పెట్టడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు జేడీ లక్ష్మీ నారాయణ.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో, బలిదానాల సాక్షిగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు . ఇకనైనా నేతలు ఆలోచించాలని ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు.